వచ్చే ఏడాది రకుల్ పెళ్లి.. వరుడు ఎవరంటే ?

వచ్చే ఏడాది రకుల్ పెళ్లి.. వరుడు ఎవరంటే ?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీతి సింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్‌..వరుస సినిమాలతో స్టార్ హీరోల పక్కన నటిస్తూ టాలీవుడ్ లో ఒక మెరుపు మెరిసింది. ఈ మధ్య ఈ అమ్మడు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రకుల్ పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు నెట్టింట వైరల్గా మారాయి.   

కొంతకాలంగా జాకీ భాగ్నానితో ప్రేమలో ఉన్న రకుల్.. త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా జాకీని ఉద్దేశించి మాట్లాడుతూ.. అతడిని శాంటా తనకు ఇచ్చిన గిప్ట్గా రకుల అభివర్ణించింది. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. వీటిపై రకుల్ స్పందించకపోయినా పెళ్లి వార్త చెప్పడం ఖాయమంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది రకుల్ నటించిన కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కానీ సక్సెస్ అవ్వలేదు. మరి న్యూ ఇయర్లోనైనా ఈ అమ్మడు విజయబావుటా ఎగరేస్తుందేమో చూడాలి. ప్రస్తుతం రకుల్ విశ్వనటుడు కమల్ హాసన్ సరసన 'భారతీయుడు-2' లో  నటిస్తోంది.