ఆర్టీసీని కాపాడుకునేందుకే సమ్మె: అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీని కాపాడుకునేందుకే సమ్మె: అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీని కాపాడుకునేందుకే సమ్మె చేస్తున్నామన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. సమ్మెను రాజకీయ కోణంలో కాకుండా… కార్మిక కోణంలో చూడాలన్నారు. కేసీఆర్… సీఎం  హోదాకు తగిన విదంగా మాట్లాడటం లేదన్నారు. ఆర్టీసీ యూనియన్లపై ఎన్నోఆరోపణలు చేశారన్నారు. సంఘాలు అనేవి కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకు ఉంటాయన్నారు.  ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారన్న అశ్వత్థామరెడ్డి.. ప్రభుత్వం తప్పుడు సమాచారం పై విమర్శించామే తప్ప…పర్సనల్ గా ఎవరినీ  విమర్శించలేదన్నారు.

2012 లో ఆర్టీసీ కార్మికులు ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తానని అన్న సీఎం ఇప్పుడు మాట మార్చడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఆర్టీసీకి ఆస్తులే లేవని అంటున్నారు…మరి ఎవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న సమ్మె న్యాయమా కాదా ప్రజాల్లోనే  రిపరెండం పెట్టాలన్నారు. 28న అన్ని కలెక్టర్ల కు మెమోరాండం ఇస్తామన్నారు. 26 డిమాండ్లలో సంఘాల నాయకులకు పర్సనల్ గా  ప్రయోజనం కలిగేవి ఎన్ని ఉన్నాయో చెప్పాలన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఆర్టీసీ పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ విషయంలో  తీసుకున్ననిర్ణయాన్ని కూడా చులకన చేసి మాట్లాడడం సరికాదన్నారు అశ్వత్థామరెడ్డి.