ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపాం: రాజ్‌నాథ్

ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపాం: రాజ్‌నాథ్

అంబాలా: రాఫెల్ జెట్స్ కొనుగోలుతో దేశ అమ్ముల పొదిలో అమూల్యమైన అస్త్రాలు వచ్చి చేరాయని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలను గురువారం అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రవేశ పెట్టారు. దీనికి హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ డిఫెన్స్ మినిస్టర్ ఫ్లోరెన్స్ పార్లీ పాల్గొన్నారు. ఆమె రాక ఇండియా-ఫ్రాన్స్ ఢిఫెన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను ప్రతిబింబిస్తోందని రాజ్‌నాథ్ చెప్పారు. ఇవి చారిత్రాత్మక క్షణాలన్నారు.

‘ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపాం. ముఖ్యంగా మన వైపు కన్నెత్తి చూడాలని ఎవరైతే యత్నించారో వారికి హెచ్చరికలు వెళ్లాయి. బార్డర్‌లో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన అడుగు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి దురదృష్టకర ఘటన జరిగిన సమయంలో ఐఏఎఫ్ అప్రమత్తత, ఏకాగ్రతకు అభినందనలు. ఇది వారి నిబద్ధతతకు అద్దం పడుతోంది. ఫార్వర్డ్ బేసెస్‌లో ఐఏఎఫ్ తన దళాలను మోహరించడాన్ని చూస్తే వారి యుద్ధ సన్నద్ధతతను అర్థం చేసుకోవచ్చు’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.