తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా.?

తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా.?

మెడికో ప్రీతి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని.. రోజు ఏదో ఒక చోట ర్యాగింగ్, హత్యాచారాలు,సైకో ప్రేమికుల చేత చిన్నారి నుంచి వృద్ధుల వరకు అందరిపై ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి చికిత్స పొందుతున్నప్పుడు సైలెంట్ గా ఉన్న ప్రభుత్వం మరణించగానే కంటి తుడుపు చర్యలు చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా..ఉంటే పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మహిళల పై ఆకృత్యాలకు కారణమైన  మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా జోరుగా జరుగుతుంటే ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే దాడులు పెరుగుతున్నాయని ఎన్ఎస్ యుఐ నాయకులు విమర్శించారు. ప్రీతి లాగా మరో అమ్మాయికి అన్యాయం జరగొద్దంటే..ప్రీతి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.. లేకపోతే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.