కానిస్టేబుల్‌ జాబ్స్.. సన్నీలియోన్ పేరుతో అడ్మిట్ కార్డు

 కానిస్టేబుల్‌  జాబ్స్.. సన్నీలియోన్ పేరుతో అడ్మిట్ కార్డు

యూపీలో కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం వచ్చిన దరఖాస్తులు పోలీసులనే కాకుండా సామాన్యులను సైతం షాక్‌కి గురిచేశాయి.  ఎందుకంటే..  యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుపై బాలీవుడ్ నటి సన్నీ లియోన్  ఫోటో కనిపించింది. ఆమె పేరు, ఫోటోతో కూడిన  అడ్మిట్ కార్డు  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

సన్నీలియోన్ పేరుతో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తిర్వా పట్టణంలోని సోనేశ్రీ బాలికల కళాశాల కేంద్రానికి వచ్చినట్లు విచారణలో తేలింది. UPPRB వెబ్ సైట్ లో  సన్నీ లియోన్  ఫోటోతో రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు.  దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.   

60 వేల 244 పోస్టులకు 48 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 17న కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష జరగనుంది.  పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పోలీసులు, ఎస్టీఎఫ్‌లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.   అభ్యర్థులు ఆధార్ కార్డుతోపరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.