టీ20ల్లో టాప్‌‌‌‌‌‌‌‌లోనే సూర్య

టీ20ల్లో టాప్‌‌‌‌‌‌‌‌లోనే సూర్య

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో నిరాశ పరుస్తున్న టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ సూర్యకుమార్​ ఐసీసీ మెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. బుధవారం రిలీజైన తాజా లిస్ట్‌‌‌‌‌‌‌‌లో సూర్య 906 రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్య ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో గత మూడు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో 15, 1, 0 స్కోర్లతో నిరాశ పరిచాడు.

పాక్​ ప్లేయర్లు రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ (811), బాబర్‌‌‌‌‌‌‌‌ (755), సౌతాఫ్రికా ఆటగాడు మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (748), న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ కాన్వే (745) టాప్‌‌‌‌‌‌‌‌–5లో నిలిచారు. విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ 15వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో మార్పు లేదు. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ టీ20 బౌలర్లలో టాప్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. అదే దేశానికి చెందిన ఫలజ్‌‌‌‌‌‌‌‌హక్‌‌‌‌‌‌‌‌ ఫారూఖీ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు పడిపోయాడు.ఇండియా నుంచి ఒక్కరు కూడా టాప్‌‌‌‌‌‌‌‌10లో లేరు.