తల్లి కాబోతున్న స్వర భాస్కర్..బేబీ బంప్ ఫొటోలు షేర్

  తల్లి కాబోతున్న  స్వర భాస్కర్..బేబీ బంప్ ఫొటోలు షేర్

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె  స్వయంగా ప్రకటించింది. తన సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. అక్టోబర్‌లో తన మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. తమ కుటుంబంలోనికి కొత్త వ్యక్తి కోసం  ఎదురుచూస్తున్నానని తెలిపింది.  దీంతో ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

సమాజ్ వాదీ పార్టీ నేత ఫహద్ జిరార్ అహ్మద్‌ను స్వర భాస్కర్ 2023  ఫిబ్రవరి 16న సీక్రెట్‌గా వివాహం చేసుకుంది.తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది.  ఫహద్‌.. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడగా ఉన్నారు.  

2019లో ఢిల్లీలో జరిగిన CAA నిరసనల సమయంలో ఈ జంట కలుసుకున్నారు. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.