యోగిజీ ఇదేనా మీ గొప్ప పాలన.. సీఎంను ప్రశ్నించిన బాలీవుడ్ నటి

యోగిజీ  ఇదేనా మీ గొప్ప పాలన.. సీఎంను ప్రశ్నించిన బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.  రాజకీయ, సామాజిక ఆంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు.  తాజాగా  ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ముస్తిం ఆటో రిక్షా డ్రైవర్‌ను కనికరం లేకుండా కొట్టిన పోలీసు అధికారి షాకింగ్ వీడియోను ఆమె తన ట్విట్టర్ లో షేర్ చేశారు.  ఈ  వీడియోలో ఓ పోలీసు అధికారి రిక్షా డ్రైవర్‌ను క్రూరంగా కొట్టడం, రోడ్డు మధ్యలో జుట్టుతో లాగడం కనిపిస్తుంది. 

ఈ వీడియోపై స్వరా భాస్కర్  స్పందిస్తూ ఇదేనా మీ పాలన అంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని ప్రశ్నించింది.  యూపీ పోలీసులు హద్దులు లేకుండా వ్యవహరిస్తున్నారని...   ఖచ్చితంగా ఇది సిగ్గుమాలిన ప్రవర్తనగా ఆమె అభిప్రాయపడింది. ఈ వీడియోను సీఎం యోగికి  ట్యాగ్ చేసింది స్వరా భాస్కర్. 

వైరల్ అవుతున్న వీడియోలోని పోలీస్ అధికారిని ఇన్‌స్పెక్టర్‌ భాను ప్రకాష్‌గా గుర్తి్ంచారు. గతంలోనూ అతనిపై  గూండాయిజానికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి.  ఈ వీడియోపై పలువురు సోషల్ మీడియా యూజర్లు తమ తమ ఖాతాల్లోకి వెళ్లి సదరు పోలీస్ అధికారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నాతాధికారులను కోరారు.