ఆ దేశంలో డైపర్లే.. డ్రాయర్లు.. 11 ఏళ్ల వరకు అందరూ..

ఆ దేశంలో డైపర్లే.. డ్రాయర్లు.. 11 ఏళ్ల వరకు అందరూ..

సాధారణంగా చంటి పిల్లలకు.. మంచంలో నుంచి కదలలేని ముసలి వారికి డైపర్లు వాడతారు.  ఇవి కూడా తప్పని పరిస్థితిలోను ఉపయోగించాలి. ఇవి కూడా అప్పుడప్పుడు మాత్రమే వేయాలి. కాని ఎంతో అభివృద్ది చెందిన, సంపన్న దేశాల్లో ఒకటైన స్విట్జర్లాండ్ లో స్కూళ్లకు పిల్లలు డైపర్లు ధరించి వస్తున్నారు.  దీంతో అక్కడి స్విట్జర్లాండ్‌లో టీచర్లకు పెద్ద సమస్య తలెత్తింది. ఇక్కడి  పిల్లలు డైపర్లు ధరించి పాఠశాలకు వస్తున్నారు.  (11 ఏళ్ల పిల్లలు డైపర్లు ధరించారు). లోదుస్తులు వేసుకున్నట్లు డైపర్లు వాడుతున్నారు.   

చిన్న పిల్లలకు బాత్‌రూమ్‌ను ఎలా ఉపయోగించాలో తెలియదు. .. ఎప్పుడు టాయిలెట్‌కి వెళ్లాలో చెప్పలేకపోవడం వల్ల డైపర్‌లు ధరించేలా చేస్తారు. దీంతో పిల్లలు డైపర్‌లోనే మూత్రం, మల విసర్జన చేస్తారు. ఆ తర్వాత వీటిని తీసేసి మరల కొత్త డైపర్‌ను ధరించేలా చేస్తారు.అయితే కొన్నేళ్ల తరువాత పిల్లలకు డైపర్‌లు అవసరం ఉండదు, ఎందుకంటే వారు ఎప్పుడు బాత్‌రూమ్‌కి వెళ్లాలి, ఎప్పుడు వెళ్లకూడదో చెప్పేంత తెలివితేటలు వస్తాయి. కానీ  ప్రస్తుతం  స్విట్జర్లాండ్ లో పాఠశాలకు వెళ్లే  పిల్లలు(11 సంవత్సరాలు) డైపర్ ధరించి స్కూలుకు వస్తున్నారు. డైపర్లను అండర్ వేర్ మాదిరిగా ఉపయోగిస్తున్నారు. 

సంపన్న దేశంలో కూడా ఇలా...

స్విట్జర్లాండ్ చాలా అందంగా ఉంటుంది.  ఇక్కడ  పర్యాటక ప్రాంతాలే కాకుండా, దాని సంపన్న సమాజానికి కూడా పేరుగాంచింది. ప్రజల ఆదాయం కూడా  ఎక్కువే. మరి  అటువంటి పరిస్థితిలో ఇక్కడి ప్రజలు కూడా చాలా ఆధునికంగా ఉంటారు. అయితే తమ పిల్లలను డైపర్లు కట్టి బడికి పంపే ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేస్తున్నారు?


చిన్నవయసులోనే పిల్లలను స్కూల్‌కి పంపడం వల్లే ...

స్విట్జర్లాండ్‌లో  పాఠశాలల్లో  డైపర్‌లు ధరించే పిల్లల సంఖ్య పెరుగుతోందని సమస్యను  ఆ దేశ ఉపాధ్యాయులు ఆవేదన వ్యర్త చేస్తున్నారు.  స్విస్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ హెడ్ డాగ్మార్ రోస్లర్ మాట్లాడుతూ....  దేశంలో 4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను కూడా పాఠశాలకు పంపుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో మరుగుదొడ్డి ఎలా ఉపయోగించాలో తల్లిదండ్రులు వారికి చెప్పలేకపోతున్నారు. కానీ ఈ సమస్య 4 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలలో మాత్రమే కాకుండా పెద్ద పిల్లల్లో కూడా ఉందని టీచర్ రోస్లర్ తెలిపారు. 

11 ఏళ్లలోపు పిల్లలకు  డైపర్లు ..

పాఠశాలకు వెళ్లే 11 ఏళ్ల చిన్నారి తనకు పేషెంట్‌గా వచ్చిందని చైల్డ్ డెవలప్‌మెంట్ ఎక్స్‌పర్ట్ రీటా మెస్మెర్ తెలిపారు.   అతని తల్లిదండ్రులు అతనికి టాయిలెట్ ఎలా ఉపయోగించాలో నేర్పించకపోవడమే వల్లే ఇలా జరిగిందన్నారు.  డైపర్లు సులువుగా దొరుకుతాయని.. అందుకే పెద్ద పిల్లలకు కూడా తల్లిదండ్రులు వేస్తున్నారు. ఆ తరువాత వాటి వలన వచ్చే ఇబ్బందులు అంతా ఇంతా కాదు.   చెత్తను శుభ్రం చేయడంలో ఇబ్బంది ఉండదని చెప్పారు.

డైపర్లు మార్చే బాధ్యత ఉపాధ్యాయులదా...

పిల్లలు అండర్ వేర్ వేసుకున్నట్లుగా డైపర్లు వేసుకుని పాఠశాలకు వస్తున్నారని ఓ విద్యా శాస్త్రవేత్త తెలిపారు. పిల్లలకు డైపర్లు మార్చడం, శుభ్రం చేయడం ఉపాధ్యాయుల బాధ్యత కాదని, బాత్‌రూమ్‌ను ఎలా ఉపయోగించాలో తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలని టీచర్ డాగ్మార్ రోస్లర్ అన్నారు. దేశంలోని చాలా మంది ఉపాధ్యాయులు ఈ సమస్యను హైలైట్ చేశారు.