తాప్సీ సిక్స్ ప్యాక్ ఫొటోలకు ఇంటర్నెట్ షేక్.. ఆ హీరోతో పోలుస్తున్న ఫ్యాన్స్

తాప్సీ సిక్స్ ప్యాక్ ఫొటోలకు ఇంటర్నెట్ షేక్.. ఆ హీరోతో పోలుస్తున్న ఫ్యాన్స్

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. ఈ విషయంలో తాప్సీ రెండడుగులు ముందుకేసింది. చిక్కడమే కాదు ఏకంగా సిక్స్ ప్యాక్ చేసి షాకిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. తన జిమ్ ట్రైనర్ తో కలిసి తన కండలు తేలిన బాడీని ఎక్స్ పోజ్ చేసింది. 

నెటిజన్లు ఈ హీరోయిన్ బాడీని బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో పోలుస్తున్నారు. ‘నువ్వు ఇప్పటికిప్పుడు టైగర్ ష్రాఫ్ లా ఎందుకు మారాలనుకుంటున్నావు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో సినీ తెరకు పరిచయమైంది తాప్సీ. 

ఇక్కడ గ్లామర్ డాల్ గానే ముద్ర పడటంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ ఈ బ్యూటీకి లక్ బాగానే కలిసొచ్చింది. నటనతో పాటు తన బోల్డ్ యాటిట్యూడ్ తోనూ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ  సినిమాల్లో తాప్సీ నటిస్తోంది.

https://www.instagram.com/p/Cqsgx2_p9dW/