పోలీసుల తోపులాటలో గాయపడిన లక్ష్మణ్… హాస్పిటల్ కు తరలింపు

పోలీసుల తోపులాటలో గాయపడిన లక్ష్మణ్… హాస్పిటల్ కు తరలింపు

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స్ట్రైక్ మద్దతుగా జీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ బస్ బవన్ వద్ద దర్నాచేశారు. ఆయన చేస్తున్న దర్నాను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్ తలకు గాయమైంది. అలాగే ఆయన్ను నారాయణగూడ పోలిస్టేషన్ కు తరలించారు. అక్కడ కొద్ది సేపు ఉంచిన తర్వాత లక్ష్మణ్ ను విడుదల చేశారు. వైద్య పరీక్షల కోసం లక్ష్మణ్ ను నిమ్స్ కు తీసుకెళ్లారు పార్టీ శ్రేణులు. అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్… కార్మికులకు సెల్ఫ్ డిస్మిస్ లు ఉండవని… కార్మిక శాఖ మంత్రిగా చేసిన కేసీఆర్ కు ఈ విషయం తెలువదా అని ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని… రాష్ట్ర సాకారానికి కృషి చేసిన వారని.. అలాంటి కార్మికులపై తెలంగాణ ఉద్యమానికి సంబందం లేని వ్యక్తి మంత్రిగా ఉండటమేంటని అన్నారు లక్ష్మణ్.   దొడ్డి దారిన మంత్రి అయిన పువ్వాడ అజయ్ కు కార్మికుల సమస్యలు ఏం తెలుస్తాయని అన్నారు. కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ దర్నాలో లక్ష్మణ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.