సాయంత్రం 5గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్

సాయంత్రం 5గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్

మరికొద్దిసేపట్లో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినేట్ సమావేశం ప్రారంభం కానుంది.  సచివాలయంలో తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ క్రమంలో మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రలు తెలంగాణ సచివాలయానికి చేరుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి చేత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు.

ఉపముఖ్యమంత్రిగా  భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకరం చేయగా.. సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలతోపాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు.