తెలంగాణలో 55 ట్రామా కేర్ సెంటర్లు

తెలంగాణలో 55 ట్రామా కేర్ సెంటర్లు

ప్రకృతి విపత్తులు,రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పడు సరైన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేషన్  ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 55  ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, మాతా శిశు అత్యవసర సేవలు, ఇతర మెడికల్, సర్జికల్ ఎమర్జెన్సీ వంటి సమయాల్లో అత్యవసర సేవలు అందిస్తారు.  ప్రమాదం జరిగితే క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చేంత వరకు వైద్యం అందించే ప్రక్రియకు రూపకల్పన చేసినట్లు మంత్రి వివరించారు, ఈ కేంద్రాలను రహదారుల పక్కన ఏర్పాటు చేస్తామన్నారు.

ఎమర్జన్సీ విభాగంలో 30 బెడ్స్, టీవీవీపీ ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని బట్టి 5,10,15,20 బెడ్స్ ఎమర్జెన్సీకి కేటాయిస్తారు. ఆటోక్లేవ్ మిషన్, మొబైల్ ఎక్స్ రే, ఈ ఫాస్ట్, సెక్షన్ ఆపరేటర్స్, డిఫ్రిబ్రిలేటర్స్, సీ ఆర్మ్, ఆల్ట్రాసోనోగ్రఫీ, ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, వెంటిలేటర్లు,  వంటి అవసరమైన, అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. ట్రామా సెంటర్లలో ఏడు విభాగాలకు చెందిన స్పెషాలిటీ వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ట్రామా కేర్ సెంటర్ లో ఉంటారు. లెవల్ 1లో 237 మంది, లెవల్ 2లో 101 మంది, లెవల్ 3లో 73 మంది ఉండి సేవలందిస్తారు. ట్రామా కేర్ సిబ్బందికి  జిల్లా స్థాయిలోనే ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ అందజేస్తారు.  

ప్రమాదంలో గాయపడిన వారిని సురక్షితంగా ఆస్పత్రికి చేర్చేందుకు 108  వాహనాలు అందుబాటులో ఉంటాయని మంత్రి అన్నారు.   ప్రస్తుతం 426 అంబులెన్సులు ఉండగా, 292 వాహనాల్లో ఏఈడీలు ఉన్నాయి. మిగతా 133 వాహనాల్లో త్వరలో ఏర్పాటు చేస్తారు.రోగ్య పరిస్థితిని వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఆన్లైన్లో అప్ లోడ్ చేస్తారు. ఈ వివరాలు సమీపంలోని ఆసుపత్రికి చేరగానే అత్యవసర విభాగం వైద్యులు అవసరమైన చికిత్సను అందించేందుకు ఏర్పాట్లు చేస్తారని హరీశ్ రావు తెలిపారు.