తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ ఫస్ట్‌, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదలైంది. ఎలాంటి ఫైన్‌ లేకుండా ఇవాళ్టి(శనివారం–జనవరి 30) నుంచి  ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. 100 రూపాయల ఫైన్ తో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, 500 రూపాయల రుసుముతో ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 2 వరకు, 1000 రూపాయల లేట్ ఫీతో మార్చ్ 3 నుంచి మార్చి9 వరకు ఫీజు చెల్లించేందుకు  ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే ఫీజు చెల్లించాలని సూచించింది.

మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ ఉండనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌, ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఒకేషనల్‌ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది.