రేవంత్ రెడ్డికి ట్రెసా గ్రీటింగ్స్

రేవంత్ రెడ్డికి ట్రెసా గ్రీటింగ్స్
  • కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు హర్షణీయమన్న రవీందర్ రెడ్డి


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర  సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) శుభాకాంక్షలు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటం హర్షణీయమని ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్, ట్రెసా రాష్ట్ర కమిటీ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు.

కొత్త ప్రభుత్వం.. ఉద్యోగుల హక్కుల రక్షణకు, ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని ఆకాక్షించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖను పటిష్టపరుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల విధులను వికేంద్రీకరించి ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకుంటుందని ట్రెసా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా..రేవంత్‌ రెడ్డికి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ క‌లెక్టర్ల అసోసియేష‌న్ అధ్యక్షుడు వి.ల‌చ్చిరెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రక‌టించడం ప‌ట్ల హ‌ర్షం వ్యక్తం చేశారు.