సెక్రటేరియట్ లో శాఖల తరలింపు షురూ

సెక్రటేరియట్ లో శాఖల తరలింపు షురూ

సెక్రటేరియట్ లో శాఖల తరలింపు మొదలైంది. సెక్రటేరియట్ లోని 80 శాతానికి పైగా శాఖలను.. పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ కు తరలిస్తున్నారు. మిగిలిన శాఖలను.. ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తరలించనున్నారు. బీఆర్కే భవన్ మొత్తం 9 ఫ్లోర్లలో శాఖలను అడ్జెస్ట్ చేయనున్నారు. తొమ్మిదో ఫ్లోర్ కు సీఎస్ ఫేషీ, జీఏడీని తరలిస్తారు. ఫైళ్ల తరలింపు కంటే ముందు.. వాటి వివరాలు నమోదు చేస్తున్నారు. వాటికి సీరియల్ నెంబర్, ఫైల్ నెంబర్, సబ్జెక్ట్,  ఫైల్ స్టేటస్, రిమార్క్స్ అన్నీ పక్కాగా నోట్ చేసుకున్న తర్వాతే… తరలిస్తున్నారు.