ఉద్యోగం కన్నా ఆలయమే మిన్న: అయ్యప్పకే జై కొట్టిన మలయాళీలు

ఉద్యోగం కన్నా ఆలయమే మిన్న: అయ్యప్పకే జై కొట్టిన మలయాళీలు

ఇండియాలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరింది. దేశంలో అత్యధిక అక్షరాస్యులు కలిగిన కేరళలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2017లో నిరుద్యోగ పీడిత రాష్ట్రా ల్లో కేరళ మూడో స్థానంలో నిలిచింది. దాదాపు వారం క్రితం కేరళలో ఎన్నికలు జరిగాయి. అయితే రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగంపై ఎక్కడా చర్చ జరగలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న లెఫ్ట్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు సమస్యలపై ఫోకస్ చేశాయి. వీటిలో శబరిమల ఆలయం, 2018 వరదల సమస్యలు ముఖ్యంగా ఉన్నాయి . వాస్తవానికి పార్టీలు ‘జాబ్స్ సమస్య పై నోరెత్తకపోవడానికి వేరే కారణం ఉంది. కేరళ ప్రజ లకు ఈ సమస్యపై అస్సలు ఇంట్రెస్ట్ లేదు.‘నేను కొన్నేళ్లుగా లెఫ్ట్ పార్టీకి మద్దతునిస్తున్నాను.‘శబరిమల సమస్య పై పార్టీ వ్యవహరించిన తీరు నాకు నచ్చలేద అని వయనాడ్ కు చెం దిన 23 ఏళ్ల మంజునాథ్ చెప్పా రు. 10 నుం చి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ను లెఫ్ట్ అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇది చాలా మంది మలయాళీ ఓటర్లకు రుచించలేదు. జాబ్స్ సమస్య ఫోకస్ కాకపోవడానికి మరో కారణం పొరుగు రాష్ట్రా ల్లో అవకాశాలు రావడమే. కేరళ యువతలో ఎక్కువ మంది ఇరుగుపొరుగు రాష్ట్రా ల్లో , ఇతర దేశాల్లో జాబ్స్ సాధిం చి అక్కడికి వెళ్తున్నారు. పశ్చిమ ఆసియాలో ఆయిల్ బూమ్ వల్ల కేరళకు చెందిన వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. ఒక్క 2013లోనే 24 లక్షల మంది కేరళ యూత్ పశ్చిమ ఆసియా దేశాల్లో జాబ్స్ సాధించారు. కానీ 2014లో క్రూడ్ ఆయిల్ క్షీణత తర్వాత గల్ఫ్ డ్రీమ్ మెల్లగా కరగడం మొదలైనా, పూర్తిగా చెరిగిపోలేదు. కేరళ జనాభాను పరిశీలిస్తే ముసలివా ళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోం ది. యువత వలసలు కూడా పెద్దోళ్ల సంఖ్యను పెద్దదిగా కనిపిం చేలా చేస్తోంది. దీని వల్ల ఆర్థిక సమస్యలు వచ్చి పడే చాన్సులు ఉన్నాయి . యువత బయటకు పోకుండా చేయడానికి కేరళ సర్కా రు చేయని ప్రయత్నమే లేదు. స్టార్టప్స్, ఇండస్ట్రియల్ పార్కులు ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగాయి. ఒక్కటీ సక్సెస్ కాలేదు. కంపెనీలు కేరళలో అడుగుపెట్టాలంటే జంకుతున్నాయి . ఇక్కడ ఉండే కార్మిక సంఘాలు బలమైనవి కావడం వల్ల అవి కేరళకు రావడం లేదని యూడీఎఫ్ కు చెందిన సురేశ్ బాబు చెప్పా రు. అంతేకాకుండా దేశంలో మరే ఇతర ప్రాంతంలో లేనంతంగా కేరళలో రోజు వారి వేతనాలు ఉన్నాయి .