హైకోర్టులో ఈసీకి ఎదురుదెబ్బ..అర్థరాత్రి జారీ చేసిన సర్క్యులర్ సస్పెండ్

హైకోర్టులో ఈసీకి ఎదురుదెబ్బ..అర్థరాత్రి జారీ చేసిన సర్క్యులర్ సస్పెండ్

రాష్ట్ర హైకోర్టులో  స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు  ఎదురుదెబ్బ తగిలింది. అర్థరాత్రి జారీ చేసిన సర్క్యులర్ ను సస్పెండ్ చేసింది. గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ గుర్తున్న వాటినే లెక్కించాలని ఆదేశించింది. ఇతర గుర్తులున్న బ్యాలెట్లను పక్కన పెట్టాలని సూచించింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని ఈసీని ఆదేశించింద. వేరే గుర్తును ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించింది. ఎన్నికలు రాజ్యాంగానికి లోబడే జరగాలని చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 7 కు వాయిదా వేసింది.

స్వస్తిక్ సహా ఇతర గుర్తులను ఓటుగా లెక్కించాలని గురువారం అర్థరాత్రి ఈసీ సర్కులర్ జారీ చేసింది. బ్యాలెట్ పేపర్ పై పెన్ను గీత ఉన్నా కూడా కౌంట్ చేయాలని ఈసీ చెప్పడం వివాదాస్పదంగా మారింది. దీంతో  ఈసీ సర్కులర్ పై  హైకోర్టులో బీజేపీ హౌజ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు  పిటిషన్ ను సస్పెండ్ చేసింది.