దిశా కేసు: వారిపై కూడా కేసులు పెట్టాలి

దిశా కేసు: వారిపై కూడా కేసులు పెట్టాలి

దిశా నేరస్తులపై సమాజంలో ఆగ్రహం రోజు రోజుకు పెరుగుతోంది. కేవలం సంఘటనలో పాల్గొన్న నేరస్తుల్తో పాటు ఇందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరిపైన మండిపడుతున్నారు ప్రజలు. నేరస్తులు వినియోగించిన లారీని గుర్తించి కూడా దాన్ని అదుపులోకి తీసుకోని రవాణా శాఖాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.  తగిన అర్హతలు, అనుభవం లేని ఆకతాయిల్ని సిబ్బందిగా నియమించుకున్న ఆ లారీ యజమాని పై కూడా కేసు నమోదు చేయాలంటున్నారు. అంతేకాదు పరిధి పేరుతో కేసు నమోదు చేయని పోలీసులపై శాఖాపరంగా పడ్డ సస్పెన్షన్‌ వేటు సరిపోదని..వారిని కూడా ఈ దుర్ఘటనకు పరోక్ష బాధ్యులుగా గుర్తించి కేసులు నమోదు చేయాలంటున్నారు జనం. వీరందరి ఫొటోలను, వివరాల్ని బహిరంగంగా తెలుపాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. మరే మహిళకు ఇలాంటి దారుణం జరక్కుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు చేపట్టాల్సి ఉందంటున్నారు.