
టైగర్ ష్రాఫ్ పేరు వినగానే గుర్తొచ్చేవి రెండు.. అద్భుతమైన డ్యాన్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్. వాటిని ‘హీరోపంతీ 2’తో మరోసారి రుచి చూపిస్తానంటున్నాడు టైగర్. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. నిన్న ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సైబర్ క్రైమ్స్‌లో ఆరితేరినవాడు లైలా (నవాజుద్దీన్ సిద్దిఖీ). హత్యలు చేయడం అతనికో సరదా. మ్యాజిక్ చేయడం అతని హాబీ. జాలి, దయ లేని ఆ సైకోని పట్టుకునే బాధ్యతని బబ్లూకి (టైగర్) అప్పగిస్తుంది పోలీస్ డిపార్ట్‌మెంట్. ఒక తెలివైన విలన్‌కి, అంతకంటే తెలివైన హీరోకి మధ్య యుద్ధం మొదలవుతుంది. అది ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఈ ట్రైలర్ చూపించింది. సైకోపాత్‌గా సిద్దిఖీ నటన మామూలుగా లేదు. ఇక టైగర్ యాక్షన్ సీక్వెన్సులు మరో లెవెల్‌లో ఉన్నాయి. హీరోయిన్ తార సుతారియా గ్లామర్ అడిషనల్ అట్రాక్షన్. మొత్తంగా టైగర్ ఇమేజ్‌కి తగ్గ సినిమా అని అర్థమవుతోంది. వెర్సటైల్ యాక్టర్ సిద్దిఖీ విలన్ కావడం అంచనాలను పెంచుతోంది.