కరోనా వారియర్స్ కు క్లోరోక్విన్

కరోనా వారియర్స్ కు క్లోరోక్విన్
  • ఐసీఎంఆర్ తాజా సూచనలు

న్యూఢిల్లీ : మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్వోరోక్విన్ ను కరోనా వారియర్స్ కు ఇవ్వాంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అడ్వయిజ్ చేసింది. ఈ ట్యాబెట్లు కరోనా వైరస్ రాకుండా నివారించగలుగుతాయని ఐసీఎంఆర్ గుర్తించింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పేషెంట్లకు సేవలందిస్తున్న హెల్త్, పారా మెడికల్, శానిటేషన్, పోలీసులకు వీటిని ఇవ్వాలని సూచించింది. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇతర సేవలు చేస్తున్న వీరు కరోనా బారిన పడే అవకాశం ఉన్నందున క్లోరోక్విన్ ను సిఫారసు చేసింది. ఢిల్లీ లోని ఎయిమ్స్ లో 300 కు పైగా ఆరోగ్య కార్యకర్తలపై వీటిని ప్రయోగించారు. ఆరు వారాల పాటు వీరు క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు వేసుకోగా వారిలో కరోనా సంక్రమణ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కరోనా హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వారికి ఈ ట్యాబ్లెట్లను ఇవ్వాలని సూచించింది. కంటైన్ మెంట్ జోన్లలో పనిచేస్తున్న వారందరికీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు కచ్చితంగా ఇవ్వాలని తెలిపింది. ఐతే కరోనా పేషెంట్లకు మాత్రం ఐసీఎంఆర్ వీటిని సిఫారసు చేయలేదు. ఈ ట్యాబ్లెట్ల కారణంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించింది. ఐతే ఐసీఎంఆర్ సూచనలకు కన్నా ముందే అమెరికా ప్రెసిడెంట్ పలుమార్లు క్లోరోక్విన్ అద్భుతమైన డ్రగ్ అంటూ ప్రశంసించారు. తాను వీటిని వాడుతున్నానని చెప్పారు.