TRS ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది

TRS ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది

నాటి వంగవీటి హత్య తరహాలోనే ప్రభుత్వ కుట్రతోనే హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్యలు జరిగాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రశ్నించే గొంతులను మట్టుబెట్టి.. న్యాయవ్యవస్థను కించపర్చే విధంగా TRS కుట్ర చేసిందన్నారు. కాలేజీ అధిపతిగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి  ఎమ్మెల్సీ కాగానే యూనివర్శిటీ అధిపతి అయ్యాన్నారు. ఏ ఆశయ సాధన కోసం బలిదానాలతో తెలంగాణ తెచ్చుకున్నామో దాన్ని సాధించుకునేందుకు యువత ఎమ్మెల్సీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సూచించారు. పట్టభద్రుల కోసం  పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం విద్యావంతులు ఏకం కావల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం.. నిరుద్యోగులను మోసం చేసిందన్న జీవన్ రెడ్డి.. ఓటు అడిగే హక్కుTRS కు లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS ప్రభుత్వనికి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లను ఇప్పటి వరకు కల్పించలేదని.. 33 జిల్లాలో ఇద్దరు డిఇఓలు మాత్రమే ఉన్నారని తెలిపారు. అంతేకాదు వర్శిటీల్లో 70 శాతం ఖాలీలు ఉన్నా భర్తీ చేయడంలేదని ఆరోపించారు. విద్యావంతులు ప్రశ్నిస్తారన్న భయంతోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థను  నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 40 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ ను తొలగించారన్నారు. ఆన్లైన్ టీచింగ్ తో దోచుకొంటున్న ప్రైవేటు విద్యాసంస్థలు.. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడంలేదన్నారు. వారు కూలీలుగా మారి కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. TRS కంటే బీజేపీ ప్రదామకరమన్నారు. మతతత్వంతో దేశాన్ని చీల్చాలని చూస్తోందని ఆరోపించారు జీవన్ రెడ్డి.