25 ఏళ్ల ప్రముఖ టీవీ నటుడు పవన్ గుండెపోటుతో మృతి

25 ఏళ్ల ప్రముఖ టీవీ నటుడు పవన్ గుండెపోటుతో మృతి

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటులు రావడం సినీ ఇండస్ట్రీని కలిచివేస్తుంది.లేటెస్ట్గా మరో యాక్టర్ హార్ట్ ఎటాక్తో చనిపోయారు. తమిళ, హిందీ టెలివిజన్ రంగంలో ఫేమస్ అయినా యాక్టర్ పవన్(Pawan) కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోవడంతో.. సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

పవన్ శనివారం తెల్లవారుజామున 5:00 గంటలకు చనిపోయినట్లు సమాచారం. ఇక పవన్ పార్థివ దేహాన్ని కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని స్వగ్రామానికి తీసుకువెళ్లనున్నారు. అక్కడ అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది. పవన్ 25 ఏళ్లకే బుల్లితెరకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు..తక్కువ టైంలో ఎంతో ఫేమస్ అయ్యారు.  

పవన్ మరణవార్తతో కుటుంబ సభ్యులతో పాటు హిందీ, తమిళ టెలివిజన్ పరిశ్రమలకు చెందిన యాక్టర్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. పవన్ మరణ వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మిస్ యూ అంటూ సంతాపం తెలుపుతున్నారు. అలాగే  2021లో, ప్రముఖ టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా 40 ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(Puneeth Raj Kumar) 2021లో హార్ట్ ఎటాక్ తో చనిపోవడంతో పలు సినిమా ఇండస్ట్రీలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి.

అలాగే ఇటీవలే ఫేమస్ కన్నడ యాక్టర్ విజయ్ రాఘవేంద్ర వైఫ్ స్పందన హార్ట్ ఎటాక్ తో చనిపోయినా విషయం తెలిసిందే. థాయ్‍ల్యాండ్ వెకేషన్‍లో ఉండగానే స్పందన చనిపోవడం మరువక ముందే.. మరో యాక్టర్కు హార్ట్ ఎటాక్ రావడం పట్ల సినిమా ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేస్తుంది. ఇలా వరుసగా కార్డియాక్ అరెస్ట్ లు జరగడంతో ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోతున్నారు.