బలం నిరూపించుకున్న ఉద్ధవ్ సర్కారు

బలం నిరూపించుకున్న ఉద్ధవ్ సర్కారు

మహారాష్ట్రలో కొత్తగా కొలువైన శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఇవాళ(శనివారం) బలనిరూపణలో విజయం సాధించింది. ఈ మూడు పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో బాగంగా మహారాష్ట్ర  అసెంబ్లీలో శనివారం బల పరీక్ష నిర్వహించగా.. ఉద్ధవ్ థాకరే సర్కారు నెగ్గింది. ఉద్ధవ్ కు అనుకూలంగా 169 ఓట్లు పడ్డాయి. బల పరీక్ష సమయానికి సభలో ఉన్న ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయకపోగా, నలుగురు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

అయితే బీజేపీకి సంబంధించిన సభ్యులు మాత్రం ఓటింగ్‌లో పాల్గొనలేదు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభమైందంటూ సమావేశాలను బహిష్కరించారు. రాజ్యాంగ విరుద్ధంగా, సభా నిబంధనలు పాటించకుండా ఎన్నిక జరిగిందని మాజీ సీఎం ఫడ్నవిస్‌ అన్నారు.