రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్

రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్

మేకిన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియా అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై ఉభయసభల్లో దుమారం చెలరేగింది. రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు లోక్ సభ, రాజ్యసభలో డిమాండ్ చేశారు. దేశ మహిళలను రాహుల్ అవమానించారని, దేశ చరిత్రలో ఇలాంటి కామెంట్స్ చేయడం రాహుల్ గాంధీకే చెల్లిందంటూ స్మృతీ ఇరానీ విరుచుకుపడ్డారు. దేశానికి రాహుల్ ఇచ్చే సందేశం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు.

మరోవైపు రాహుల్ కామెంట్స్ ను సమర్థించారు డీఎంకే ఎంపీ కనిమొళి. ప్రధాని ఎప్పుడూ మేకిన్ ఇండియా అని అంటుంటారని, అలాంటిది దేశంలో ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే.. రేప్ ఇన్ ఇండియా అన్నట్లుగా మారిందని చెప్పడమే ఉద్దేశం అని వివరించారు. అయితే బీజేపీ ఎంపీలు మాత్రం రాహుల్ క్షమాపణకే డిమాండ్ చేశారు.