నన్నే డబ్బులు అడుగుతావా.. స్వీట్స్ షాపులో పోలీస్ ఓవరాక్షన్

నన్నే డబ్బులు అడుగుతావా.. స్వీట్స్ షాపులో పోలీస్ ఓవరాక్షన్

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కు చెందిన ఒక వీడియో వైరల్ అవుతోంది. దీన్ని స్వీట్స్ దుకాణంలో చిత్రీకరించబడినట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న ఓ పోలీసు.. దుకాణదారుడిపై తన ప్రతాపం చూపినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోలో దుకాణదారుడిపై పోలీసు దూకుడుగా ప్రవర్తించడం చూడవచ్చు. ఆర్డర్ కోసం డబ్బు చెల్లించమని అడిగడంతో.. కోపంతో ఊగిపోయిన పోలీసు.. దుకాణదారుని భయపెట్టడానికి ప్రయత్నించాడు. పోలీసు తాగి ఉన్నాడని గమనించిన దుకాణదారుడు వెంటనే అరవడం ప్రారంభించాడు. ఈ తతంగాన్ని అంతా కూడా ఓ వ్యక్తి మొబైల్ కెమెరాలో రికార్డ్ చేసి..సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఈ క్రమంలోనే ఇన్‌స్పెక్టర్ తన ఫోన్ తీసి కౌంటర్ దగ్గర నిలబడి చూస్తాడు. కొద్దిసేపటి తర్వాత, అతను "సార్" అని సంబోధిస్తూ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడటం కనిపిస్తుంది. కాల్‌లో ఉన్న వ్యక్తిని షాప్‌కి రమ్మని అతను చెప్పడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

మరో వీడియోలో పోలీసు దుకాణదారుడితో గొడవపడి ఎంత చెల్లించాలని అడిగాడు. తన ఆర్డర్ కోసం పోలీసు రూ. 110 చెల్లించాలని దుకాణదారు చెప్పగా.. మద్యం మత్తులో ఉన్న పోలీసు UPI స్కాన్ ద్వారా చెల్లించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను ఆ చెల్లింపు చేయలేకపోతాడు. పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్‌ని కూడా స్కాన్ చేయలేనంతగా పోలీసులు తాగి ఉన్నారని దుకాణదారుడు చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాన్పూర్,  యూపీ పోలీసులను ట్యాగ్ చేసి, పోలీసుపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే ఆ పోలీసును సస్పెండ్ చేశామని, ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని కాన్పూర్ పోలీసులు ట్వీట్ చేశారు.

పోలీసు స్వీట్లు ఆర్డర్ చేశాడని, అయితే తన ఆర్డర్ కోసం డబ్బు చెల్లించాలని దుకాణదారు అడగడంతో అతను కోపానికి గురయ్యాడు. ఈ ఘటనను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు యూపీ పోలీసులు, కాన్పూర్ పోలీసులను ట్యాగ్ చేశారు. కాన్పూర్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ “కల్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైరల్ అయిన ఈ వీడియోలో యూఎన్ సర్వేంద్ర కుమార్‌ను డీసీపీ వెస్ట్ సస్పెండ్ చేసి పోలీసు లైన్‌కు అటాచ్ చేస్తున్నారు. అలాగే మొత్తం ఎపిసోడ్‌ను ఏసీపీ పంకీ విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు"అని చెబుతున్నారు.

https://twitter.com/MohtaPraveenn/status/1670484244693659650