వైరల్ వీడియో: అమ్మకానికి వాడేసిన పీపీఈ కిట్లు

వైరల్ వీడియో: అమ్మకానికి వాడేసిన పీపీఈ కిట్లు

ఓ వైపు దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతుంటే... మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. వాడి పారేసిన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు తిరిగి అమ్మేందుకు వాష్ చేస్తున్న వీడియో... సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన సాట్నా జిల్లా బర్కెడా గ్రామంలోని బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ యూనిట్‌లో వెలుగుచూసింది. ఈ వీడియోలో మాస్కులు ధరించిన కొంత మంది.. ఆల్ రెడీ యూజ్ చేసిన గ్లోవ్స్, మాస్కులు వాష్ చేస్తూ కనిపించారు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి యూజ్ చేసిన వాటిని జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి. విషయం తెలిసిన వెంటనే ఘటనపై విచారించాలని సాట్నా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత ఈ కేసును మధ్యప్రదేశ్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డుకు బదిలీ చేశారు. ఘటన జరిగిన ప్లాంట్‌ను అధికారులు విజిట్ చేశారు. పీపీఈ కిట్లను, గ్లౌజులను వాష్ చేసి.. రీ సేల్ చేస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.