ఎమోషనల్‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌

ఎమోషనల్‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌

రీసెంట్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన ‘జల్సా’ మూవీతో తానెంత గొప్ప నటో మరోసారి ప్రూవ్ చేసింది విద్యా బాలన్‌‌‌‌‌‌‌‌. ఇప్పుడు అంతకు మించిన బలమైన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందామె. కృతీసనన్‌‌‌‌‌‌‌‌ ప్రధాన పాత్రలో ‘మిమి’ చిత్రాన్ని తీసిన లక్ష్మణ్ ఉతేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో విద్య నటించనుంది. ఆ సినిమాని నిర్మించిన దినేష్‌‌‌‌‌‌‌‌ విజనే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. ఇది కూడా ఉమెన్ సెంట్రిక్ సినిమానే. కొవిడ్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ సబ్జెక్ట్. విద్య పాత్ర కూడా చాలా ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని చెబుతోంది టీమ్. అయితే ఇప్పటికే అను మీనన్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ‘డాటెడ్‌‌‌‌‌‌‌‌ లైన్’ అనే క్రైమ్ డ్రామా చేయడానికి ఎస్ చెప్పింది విద్య. ఇది పూర్తయ్యాకే లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ సినిమాని స్టార్ట్ చేయనుంది. జూన్‌‌‌‌‌‌‌‌లో సెట్స్‌‌‌‌‌‌‌‌కి వెళ్లే చాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతీక్ గాంధీతో కలిసి విద్య నటిస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. అలాగే తనతో శకుంతలాదేవి, షేర్నీ, జల్సా చిత్రాలు నిర్మించిన విక్రమ్‌‌‌‌‌‌‌‌ మల్హోత్రా బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో సినిమాకి కూడా కమిటయ్యింది విద్య.