మరో సెన్సేషనల్ బయోపిక్ కు రెడీ అంటున్న విద్య

మరో సెన్సేషనల్ బయోపిక్ కు రెడీ అంటున్న విద్య

ఇప్పుడు హవా అంతా బయోపిక్స్‌‌దే. ఏ భాషలో చూసినా ఎవరో ఒకరి జీవిత గాథ తెరకెక్కు తూనే ఉంది. వాటిలో నటించడానికి పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. విద్యాబాలన్‌‌ కూడా అంతే. ఆల్రెడీ డర్టీ పిక్చర్​తో పాటు ఎన్టీయార్ బయోపిక్ లోనూ నటించింది. ఇప్పుడు మరో బయోపిక్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తోంది. కథ, తన పాత్ర ఎంతో నచ్చితే తప్ప ఏ సినిమానీ అంగీకరించని విద్య… ఒకరి బయోపిక్ అయితే మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా ఎస్ అనేస్తానంటోంది. ఇంతకీ అది ఎవరి బయోపిక్కో తెలుసా… శ్రీదేవిది.

అవును. ‘శ్రీదేవి పాత్రలో నటిం చే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. ఆమె ఒక గొప్ప నటి. నిజం చెప్పాలంటే ఆమెలా కనిపిం చడం, మెప్పించడం అంత తేలిక కాదు. కానీ నిజాయతీగా ప్రయత్నిస్తా ను’ అంటోంది విద్య. బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ స్వయంగా నటిస్తానంటే ఎవరొద్దంటారు? బోనీ కపూర్ ఆల్రెడీ శ్రీదేవి బయోపిక్ తీసే ప్లాన్స్‌‌లో ఉన్నాడు. పైగా అతడు ప్రొడ్యూస్ చేస్తోన్న ‘పిం క్’ తమిళ రీమేక్‌‌లో కూడా విద్య నటిస్తోంది. కాబట్టి వెంటనే విద్యతో శ్రీదేవి బయోపిక్‌‌ను పట్టాలెక్కించి నా ఆశ్చర్యపోనక్కర్లేదు.