2 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత ..29 ఆటోలు సీజ్

2 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత ..29 ఆటోలు సీజ్

నర్సాపూర్, వెలుగు: విజిలెన్స్ ఆఫీసర్ లు ఓ రైస్ మిల్ పై రైడ్ చేసి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లాలో జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ పి మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాల నుంచి దళారుల ద్వారా రేషన్ బియ్యం కొనుగోలు చేసి, తీసుకొచ్చి రీ సైకిల్ చేసి కొత్త బ్యాగుల్లో నింపి అమ్ముతున్నట్టు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు నర్సాపూర్ మండలం , కాగజ్ మద్దూర్ లో శ్రీధర్ గుప్తాకు చెందిన  శ్రీ సాయి రైస్ మిల్ పై విజిలెన్స్ అధికారులు రైడింగ్ చేశారు. రైస్ మిల్ ప్రాంగణంలో బియ్యంతో ఉన్న 29 ట్రాలీ ఆటోలను గుర్తించారు. వాటిలో ఉన్న 2 వేల క్వింటాళ్ల  బియ్యం సీజ్ చేశారు. రైస్ మిల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు విజిలెన్స్ సీఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరు విజిలెన్స్ ఎస్సై లతో పాటు,  నర్సాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.