గాలివాన బీభత్సం.. పంట నష్టం

గాలివాన బీభత్సం.. పంట నష్టం

నిన్నమొన్నటి దాక ఎండలు ఎడతెరిపి లేకుండా దంచికొట్టాయి. ఆదివారం (ఈరోజు) ఒక్కసారిగా రాష్ట్రమంతటా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగు పడి జనగామలో ఒకరు, మహబూబాబాద్ లో మరొకరు చనిపోగా.. అక్కడక్కడ పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. నల్గొండ జిల్లాలోని చిట్యాల్ లోని శాంతి నగర్ లో పిడుగు పడి కొబ్బరి చెట్టు కాలిపోయింది. 

ఈదురు గాలులకు చెట్లు కూలిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఉరుములుతో కూడిన వర్షం వల్ల కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పొసిన మొక్కజొన్న, వరి రాశులు తడిసిపోయాయి. ధాన్యం  రాశుల్లోకి వర్షం నీరు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు కాలాలు కష్టపడి పండించిన పంట నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాని కోరుతున్నారు.