షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?

షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?

పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు.. పండ్లు ఏవైనా తీయగా ఉంటాయి కాబట్టి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పండ్లలో సహజ సిద్ధమైన చక్కెర ఉంటుంది. ఇది మనం తినే బయటి చక్కెరకు భిన్నంగా ఉంటుంది. చాలామంది షుగర్ ఉన్న వారు ఏవైనా పండ్లు తినాలంటేనే భయపడుతుంటారు. వాటిలో ఉంటే చక్కెర నిల్వల కారణంగా రక్తంలో చక్కెర పెరుగుతుందని వారి భయం.. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు అసలు పండ్లే తినకూడదా? .. షుగర్ వ్యాధి గ్రస్తులు తినాల్సిన పండ్లు, తినకూడని పండ్ల గురించి తెలుసుకుందాం. 
   
పండ్లలో ఎక్కువ చక్కెర ఉంటుందని తెలుసు..అయితే ఏ యే పండ్లలో ఎంత చక్కెర ఉంటుంది? పండ్లలో రారాజు మామిడి పండు అని అందరికి తెలుసు. ఎండాకాలంలో దొరికే ఈ సీజనల్ ఫ్రూట్ ను తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. పండ్లలో ఎక్కువ చక్కెర ఉండే పండు మామిడి అని చెబుతుంటారు. అన్ని పండ్లకంటే మామిడి పండ్లలో అత్యధికంగా చక్కెర ఉంటుందట. 

మీడియం సైజు మామిడి పండులో 45 గ్రాముల చక్కెర ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధి గ్రస్తులు మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదు. బరువు తగ్గాలి అనుకునే వారు కూడా మామిడి పండ్లను ఎక్కువ మోతాదులో తినకూడదు. అదేవిధంగా చక్కెర అధికంగా ఉండే ఫ్రూట్స్ లలో ద్రాక్ష కూడా ఎక్కువ చక్కెర ఉంటుంది. ఒక కప్పు ద్రాక్ష పండ్లలో 23 గ్రాముల వరకు చక్కెర ఉంటుందట. మధుమేహ వ్యాధిగ్రస్తులు ద్రాక్ష పండ్లు తినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. 

ఇక పుచ్చు కాయ, చెర్రీ పండ్లు, పియర్ పండు, అరటి పండ్లలో కూడా కొంచె ఎక్కువగా చక్కెరలు ఉంటాయి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక మీడియం సైజ్ పుచ్చకాయ ముక్కలో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక పియర్ పండు లో కూడా 17 గ్రాముల చక్కెర ఉంటుందట. 1 అరటిపండులో 14 గ్రాములు చక్కెర ఉంటుంది. ఈ పండ్లలో ఎక్కువగా చక్కెర ఉంటుంది కాబట్టి పరిమిత  మోతాదులో తినాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు .