Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మలయాళ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్(Manjummel Boys). సర్వవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 242 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. 

ఇటీవలే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. ఇక్కడ ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టింది ఈ మూవీ. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. నిజానికి ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా మే 5 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. దీంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి థియేటర్స్ లో  బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.