Vijay Devarakonda: కొత్తవారితో రిస్క్ చేయను.. అందుకే నో ఛాన్స్.. విజయ్ షాకింగ్ కామెంట్స్

Vijay Devarakonda: కొత్తవారితో రిస్క్ చేయను.. అందుకే నో ఛాన్స్.. విజయ్ షాకింగ్ కామెంట్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ప్రస్తుతం కొత్త దర్శకులకు పని చేయనని, వారికి అవగాహన తక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను కొత్త దర్శకులతో పని చేయడానికి సిద్ధంగా లేను. కారణం.. వారికి సినిమా పరిసరాలపై అవగాహన తక్కువగా ఉంటుంది. చాలా ఎలిమెంట్స్ ను  హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక సినిమా చేసినా ఒకే కానీ,, మొదటి అవకాశం అంటే రిస్క్ తీసుకోలేను. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే విజయ్ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మొదటి సినిమా అవకాశం వచ్చింది కాబట్టే పెళ్లి చూపులు వచ్చింది, మొదటి అవకాశం వచ్చింది కాబట్టే అర్జున్ రెడ్డి వచ్చింది. మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.