బాలీవుడ్ నటుడితో తమన్నా ప్రేమాయణం!

బాలీవుడ్ నటుడితో తమన్నా ప్రేమాయణం!

వాలెంటెన్స్​డే రోజున పలువురు సెలబ్రిటీలు తమ లవ్​‌‌ను ఎక్స్​ప్రెస్ చేశారు. ఈ జాబితాలో మిల్కీ​ బ్యూటీ తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ చేరారని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ జంట ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రూమర్ ఇప్పుడు నిజామే అనిపిస్తోంది. లవ్​లో ఉన్నట్లు విజయ్ వర్మ తన ఇన్​స్టాలో ఓ ఫొటోను పోస్టు చేశాడు. ఇందులో వారి కాళ్లను ఫోటో తీసి దానికి లవ్ ఎమోజీని జత చేశాడు. అయితే దీనిపై తమన్నా మాత్రం అధికారికంగా స్పందించ లేదు.

ఇక తమన్నా, విజయ్ రిలేషన్ లస్ట్​ స్టోరీస్​ 2 నుంచి స్టార్ట్​ అయ్యింది. అప్పటినుంచి వీరు అడపాదడపా మీడియా కంట్లో పడుతునే ఉన్నారు. న్యూ ఇయర్​ వేడుకలను ఇద్దరూ కలిసి జరుపుకున్నారు. అలాగే ఓ ఇవెంట్​లో రెడ్​ కార్పెట్​‌‌పై కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. గతేడాది నవంబర్​లో ఫ్యాషన్​షో ఇవెంట్​లో పాల్గొన్నడం.. ఇలా వీరి ప్రేమ పుకార్లకు మరింత తావిచ్చాయి. గతేడాది డిసెంబర్ ​21న తమన్నా బర్త్​డే రోజు విజయ్​ ఆమె ఇంటికి వెళ్లడం కూడా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.