సెప్టెంబర్ 16 నుంచి లెజెండ్ లీగ్ క్రికెట్

సెప్టెంబర్ 16 నుంచి లెజెండ్ లీగ్ క్రికెట్

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ బ్యాట్ పట్టాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని అధికారిక ఇన్ స్ట్రాగ్రామ్ లో వీడియో పోస్టు చేశాడు. ‘తయ్యారి షురూ.. ప్రాక్టీస్.. కభికభి కర్లేతాహూ.. లెజెండ్స్ లీగ్’ అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చారు. మళ్లీ గ్రౌండ్ కు తిరిగి రావడానికి సంతోషిస్తున్నట్లు వెల్లడించాడు. జట్టును ఎంపిక విషయంలో తాము ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్’ కోసం ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఛారిటీ మ్యాచ్ జరుగనుంది. 

వరల్డ్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్ లో ఇండియా మహారాజాస్ తరపున సెహ్వాగ్ ఆడనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు మాజీ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొననున్నారు. దేశంలోని పలు స్టేడియాలు మ్యాచ్ లకు అతిథ్యం ఇవ్వనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 05న జరుగనుంది. ప్రతి జట్టు ఇతర జట్టుతో రెండుసార్లు ఆడనుంది. లీగ్ లో మొత్తం 15 మ్యాచ్ లు జరుగనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి.