ఓటు వేసే రోజు పండగలా చేస్తున్నారు కానీ.. 

ఓటు వేసే రోజు పండగలా చేస్తున్నారు కానీ.. 
  • రాజ్యాధికారం కోసమని గుర్తించడం లేదు
  • మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య

హైదరాబాద్: ఓటు వేసే రోజు ను ఒక పండుగ లాగా చేస్తున్నారు...తప్ప అది రాజ్యాధికారనికి సంబంధించింది అని ఎవరు గుర్తించడం లేదని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రచించే మేధావులు ఉన్నారు..రాజ్యాంగాన్ని ఎవరూ సక్రమంగా అమలు చేయడం లేదని, మానవ హక్కులపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. మానవ హక్కులపై చైతన్యం కల్పిస్తున్నామని, ఒక మనిషిని మనిషిలాగా చూడాలని ఆయన సూచించారు. ఆదివారం రవీంద్రభారతిలో మాల మాదిగ ఉప కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కవి తిరుపతి రచించిన మేనిఫెస్టో పుస్తక ఆవిష్కరణ జరిగింది. మేనిఫెస్టో బుక్ ను మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, పసునూరి రవీందర్,  ప్రొఫెసర్ సుజాత, బహుజన నేతలు తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్బంగా మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ ఇది ఒక మేధావుల సమ్మేళనం అన్నారు. మనిషి  సంస్కృత జీవి అని గుర్తు చేస్తూ.. ఈ సభ మానవ హక్కుల పరిరక్షణ సభలాగా అనిపిస్తోందన్నారు. మానవుల అందరిలో సంస్కృత మార్పు రావాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ మేనిఫెస్టో లో అన్ని విషయాలను చర్చిడం జరిగిందని, ఈ  మేనిఫెస్టోతో మానసిక పరిపక్వత కల్పిస్తున్నారని, అలాగే ఈ మేనిఫెస్టో లో మానవత విలువలు  చెప్పడం జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాధికారం అనేది వివరణ తో కూడిన అర్థం ఇందులో కనిపిస్తోందన్నారు. 
అధికార యంత్రాంగం రాజ్యాంగ బద్దంగా నడవాలి
అధికార యంత్రాంగం రాజ్యాంగ బద్దంగా నడవాలని, అణగారిన వర్గాల్లో చైతన్యం తీసుకురావాలని జస్టిస్ చంద్రయ్య కోరారు. ఈ మేనిఫెస్టో ఎవరికి వ్యతిరేకంగా లేదని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం మే ఒక మేనిఫెస్టో అని,రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన అవకాశాలు రావాలి, అందరినీ చైతన్య వంతులను చేయాలన్నారు. అణగారిన వర్గాలను చైతన్యం చేయడానికి, వారి బాధలను నిర్ములించడానికి ఈ మేనిఫెస్టో పని చేస్తోందన్నారు. ఐక్యంగా ఉంటేనే ఏదయినా సాదించగలమన్నారు. చాలా మంది మానసిక వివక్షకు గురి అవుతున్నారని, అందరికీ సంఘాలు ఉన్నాయి...అందరూ ఐక్యంగా ఉన్నారు...కానీ మాల మాదిగాల్లో ఐక్యత లేదని, అది రావాల్సిన అవసరం ఉందని, ఆ మార్పు రావడానికి ఈ మేనిఫెస్టో ఉపయోగపడుతుందన్నారు. మాల మాదిగాలు శతృ స్వభావంతో చూస్తున్నారు తప్ప స్నేహభావంతో చూడటం లేదన్నారు. భారత దేశంలో కుల వ్యవస్థ ఉంది, కుల, మత వ్యవస్థ నే అభివృద్ధికి నిరోధకం...కులాల మధ్య,మతాల మధ్య ఐక్యత ఉండాలి, అందరూ ఐక్యంగా ఉంటే సోషలిస్టు సమాజాన్ని నిర్మించుకోవచ్చు,  ఈ మేనిఫెస్టో అందరికి మార్గదర్శకం కావాలి అని జస్టిస్ చంద్రయ్య అన్నారు. 
61 కులాలను ఏకం చేయాలి: పాశం యాదగిరి
61 కులాలను ఏకం చేయాలని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కోరారు. ఆచరణ గుణం ఉండాలి...అది ఉన్నపుడే సాధ్యం అవుతుందన్నారు. ఏదయినా ముందుకు పోదాం అంటే మేనిఫెస్టో ఉండాలని ఆయన గుర్తు చేశారు. అగ్ర వర్ణాల వారే ముఖ్యమంత్రి అవుతున్నారని, 61 కులాలను ఏకం చేసి అందరి ఆత్మగౌరవాన్ని  కాపాడాలన్నారు. ఈ మేనిఫెస్టో విజయవంతం కావాలంటే 9 కోట్లకు చేరాలి అన్నారు. మాల మాదిగలు ఐక్యంగా ఉండాలి, మాకు రిజర్వేషన్లు వద్దు...అధికారం కావాలి అని నినదించాలన్నారు. బహుజనులు ఏకం ఐనప్పుడే రాజ్యాధికారం సాధ్యం అవుతుందని, మానవ హక్కులు మాల మాదిగలకు కల్పించాలన్నారు. ఈ మేనిఫెస్టో ఒక టార్చ్ లైట్ గా, లైట్ హౌస్ గా పని చేస్తోందని, అందరూ ఈ మేనిఫెస్టో చదవాలని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కోరారు.