రాష్ట్రంలో ఆగస్టు 20 వరకు ఉక్కపోతే.!

రాష్ట్రంలో ఆగస్టు 20 వరకు ఉక్కపోతే.!

రాష్ట్రంలో నిన్నటి మొన్నటి వరకు భారీ వర్షాలు, వరదలతో  అవస్థలు పడ్డ జనం.. ఇపుడు మరోసారి ఉక్కపోతతో ఇబ్బంది పడనున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో   వాతావారణం  వేడెక్కుతోంది. ఆగస్టు 20 వరకు  రాష్ట్రంలో ఉక్కపోత ఉండనుంది. ఇప్పట్లో దట్టమైన మేఘాలు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు.

 సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు ఊపందుకోవాలి.. కానీ విచిత్రంగా ఎండలు, ఉక్కపోత పెట్టనుంది.  పొడి మేఘాలు కమ్ముకోవడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రుతుపవనాల కదలికలు తెలంగాణలో బలహీనంగా ఉన్నాయి. గత వారం కురిసిన వర్షాల వల్ల కూడా వేడి పెరుగుతోంది. భూగర్భ జలాల నుంచి వేడి, తేమ, వాతావరణంలో కలుస్తున్నాయి. అందువల్ల ప్రజలకు ఉక్కపోత ఫీల్ కలుగుతోంది. ఉదయం పది గంటలు దాటితే విపరీతమైన వేడి ఉంటుంది.