
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు వంటి సంస్థలు ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింది. 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.19 తగ్గిస్తున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. 19 కిలోల సిలిండర్ ధర రూ. 1,745.50కి దిగివచ్చింది. నెలవారీగా ధరలు తగ్గించడం ఇది రెండోసారి.
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర కిలోలీటర్‌కు రూ. 749.25 లేదా 0.7 శాతం పెరిగి దేశ రాజధానిలో రూ.1,01,642.88కి చేరుకుంది. ముంబైలో ధరలు కిలోలీటర్‌కు రూ.94,466.41 నుంచి రూ.95,173.70కి పెరిగాయి. స్థానిక పన్నులను బట్టి ధరలు ఒక్కో రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.