
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ బ్లాక్‌స్టోన్‌కు వాటాలున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీఓకి రావడానికి రెడీ అయ్యింది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 8న ఓపెన్ కానుంది. మే 10న ముగుస్తుంది. మే 7న యాంకర్ల ఇన్వెస్టర్ల కోసం ఓపెన్‌లో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3,000 కోట్లు సేకరించాలని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తోంది.
ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.1,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద మరో రూ. 2 వేల కోట్లను సేకరించనుంది. బ్లాక్‌స్టోన్ గ్రూప్‌కు చెందిన బీపీపీ టోప్కో విఐఐ పీటీఈ లిమిటెడ్ ఓఎఫ్‌ఎస్ కింద షేర్లను అమ్మనుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌లో 98.72 శాతం వాటా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు 1.18 శాతం వాటా ఉంది. ఐపీఓ అనుమతులను ఈ నెల ప్రారంభంలో సెబీ నుంచి కంపెనీ పొందింది.