వలస కార్మికులను తరలించడంలో ఏం ఇబ్బంది: హైకోర్టు

వలస కార్మికులను తరలించడంలో ఏం ఇబ్బంది: హైకోర్టు
  • శ్రామిక్ స్పెషల్ నడపరెందుకు?
  •  వేరే ట్రైన్లకు బోగీలు తగిలించడానికేం?
  •  పెళ్లిళ్లు, టూర్లకైతే కేటాయిస్తరా?
  •  రైల్వేకు ఆదాయమే ముఖ్యం కావొద్దు : హైకోర్టు
  •  ఇయ్యాల విచారణకు రావాలని డీఆర్ఎంకు ఆదేశం

‘సాధారణ రైళ్లకు ఒకటి, రెండు బోగీలు తగిలించి వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చడం లో రైల్వేకు ఇబ్బంది ఏముంది? రెగ్యులర్ రైలుకు మాత్రం పెళ్లి, లిటూరిస్టు ప్రాంతాలకు వెళ్లేబోగీలను అటాచ్ చేస్తరు. వలస కార్మికులకు కేటాయించలే రా? రైల్వే డీఆర్‌‌‌‌ఎంకు మనసు లేదా?భారీ లగేజీతో ఉండే గూడ్స ‌‌‌రైలుకు 70కిపైగా బోగీలు ఉంటాయి.. జనం వెళ్లే రైలుకు 24 బోగీలు దాటకూడదా? పాతిక బోగీలు ఉండకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పండి. రెగ్యులర్‌ ‌‌‌రైలులో ఒకట్రెండు బోగీలు వలస కార్మికులకు కేటాయించకూడదని ఏమైనా చట్టం లో ఉందా?’ అని హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. వీటిపై స్పష్టత ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌‌‌‌ఎం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ‌‌‌విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. లాక్డౌన్ వల్ల పనుల్లేక ఇబ్బంది పడుతున్న వలస కార్మికులను సొంత రాష్ట్రానికి తరలించే విషయంలో రైల్వే శాఖ తమ సూచనలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదని నిలదీసింది. 45 మంది బీహారీల కోసం ఒక రైలు బోగీని రెగ్యులర్‌ ‌‌‌రైలుకు కలిపితే సరిపోతుందని, అదనపు బోగీ కలపలేమని ఎందుకు చెబుతోందో అర్థం కావడంలదని వ్యాఖ్యానించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు రైల్వే డీఆర్‌‌‌‌ఎం మంగళవారం స్వయంగా విచార ణకు హాజరు కావాలని చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌‌‌‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ విజయ్‌సేన్‌ ‌‌‌రెడ్డిల డివిజన్‌ ‌‌‌బెంచ్‌ ‌‌‌ఆదేశించింది.

 ఆదాయమే లక్ష్యం కావొద్దు

రైల్వే శాఖ ఆదాయమే లక్ష్యంగా ఉండకూడదని కోర్టు హితవు లికింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను వారి రాష్ట్రాలకు తరలించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ప్రొఫెసర్‌‌ ‌‌రామశంకర్‌ ‌‌‌నారాయణ మేల్కొటి, లాయర్‌ ‌‌‌పీవీ కృష్ణయ్య, మానవ హక్కుల వేదిక ప్రతినిధి జీవన్‌‌‌‌ కుమార్‌‌‌‌ దాఖలు చేసిన పిల్స్‌ ‌‌ను బెంచ్ సోమవారం మరోసారి విచారించింది. వలస కార్మికుల తరలింపునకు రాష్ట్రప్రభుత్వం కోరడానికి ముందే హైకోర్టు ఆదేశాలిచ్చిందని, రెగ్యులర్‌ ‌‌‌రైలుకు ఒకటి రెండు బోగీలను వలస కార్మికుల కోసం యాడ్‌‌‌‌ చేసుంటే ఈపాటికి వారి సమస్యకు తెరపడి ఉండేదని అభిప్రాయపడింది.

తప్పుడు వివరాలు ఇస్తరా?

సికింద్రాబాద్ దగ్గర్లోని మనోరంజన్ కాంప్లెక్స్ కాళీగా లేదంటూ తప్పుడు సమాచారమివ్వడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. తప్పుడు వివరాలిస్తే ఏం జరుగుతుందో కలెక్టర్ కు తెలియదా అంటూ నిలదీసింది. మూడంతస్తుల కాంప్లె క్స్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నా కూడా.. ఖాళీ లేదంటూ ప్రభుత్వం కౌంటర్ వేయడా న్నితప్పుబట్టింది. కాంప్లెక్స్ లో టాయిలెట్స్ లేవంటూ ఏజీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. రిజిస్ట్రార్ స్వయంగా పరిశీలించి చూశారని పేర్కొంది. కాగా, వలస కార్మికుల సంఖ్య 120 లోపే ఉందని, వారిని తరలించేందుకు బోగీలు ఏర్పాటు చేయడమే ముఖ్యమని పిటిషనర్ లాయర్ వసుధా నాగరాజ్ చెప్పారు.