పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో వికీపీడియా బ్లాక్‌‌‌‌‌‌‌‌

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో వికీపీడియా బ్లాక్‌‌‌‌‌‌‌‌

దైవ దూషణ కంటెంట్‌‌‌‌‌‌‌‌ను బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో నిర్ణయం

ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌సైక్లోపీడియా వికీపీడియాను పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేసింది. తాము చెప్పిన కంటెంట్‌‌‌‌‌‌‌‌ను తొలగించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ దేశ టెలీ కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌ అథారిటీ శనివారం తెలిపింది. దైవ దూషణ ఉన్న కంటెంట్‌‌‌‌‌‌‌‌ను తొలగించాలని, లేకపోతే సైట్‌‌‌‌‌‌‌‌ను బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేస్తామని వికీపీడియాను పాక్ టెలికాం అథారిటీ హెచ్చరించింది. దాని కోసం 48 గంటల టైమ్‌‌‌‌‌‌‌‌ కూడా ఇచ్చింది. అయితే, వికీపీడియా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైట్‌‌‌‌‌‌‌‌ను బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దైవ దూషణ కంటెంట్‌‌‌‌‌‌‌‌ను తొలగించిన తర్వాత తమ నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొన్నారు.