సెక్యూరిటీ సమిట్​లో భాగంగానే సీక్రెట్ మీటింగ్

సెక్యూరిటీ సమిట్​లో భాగంగానే సీక్రెట్ మీటింగ్

సింగపూర్ : వరల్డ్​వైడ్​గా ఉన్న కొన్ని ముఖ్యమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన సీనియర్ అధికారులు సింగపూర్​లోని షాంగ్రిలా హోటల్​లో జరిగిన సెక్యూరిటీ మీటింగ్​లో భాగంగా రహస్యంగా సమావేశమైనట్లు ఐదుగురు వ్యక్తులు రాయిటర్స్​కు వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వం చాలా ఏండ్లుగా ఇలాంటి సీక్రెట్ మీటింగ్స్ నిర్వహిస్తున్నదని వారు వివరించారు. సెక్యూరిటీ సమిట్​లో భాగంగానే ఎవరికీ తెలియకుండా సీక్రెట్​గా ఓ స్పెషల్ రూమ్​లో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.

యూఎస్ తరఫున నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ సీక్రెట్ మీటింగ్​కు అటెండ్ అయ్యారన్నారు. ఇండియా ఓవర్సీస్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఏజెన్సీ హెడ్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్​చీఫ్​ సమంత్​ గోయెల్​ కూడా ఈ మీటింగ్​కు అటెండ్ అయినట్లు ఇండియా వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ సర్వీసుల్లో చెప్పని కోడ్ ఒకటి ఉందని ఐదుగురు వ్యక్తుల్లోని ఒకరు వివరించాడు. వారంతా అధికారిక, ఓపెన్ డిప్లొమసీ కష్టంగా ఉన్నప్పుడే మాట్లాడుకుంటారని, ఇది ఉద్రిక్త సమయాల్లో చాలా కీలకం అవుతుందన్నారు. సింగపూర్ ప్రభుత్వం సీక్రెట్ మీటింగ్ ప్రోత్సహించడంలో సహాయపడుతున్నదని వివరించారు. షాంగ్రిలా సెక్యూరిటీ మీటింగ్​కు వివిధ దేశాల చీఫ్​లు అటెండ్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన సీనియర్ అధికారులతో సహా పాల్గొనేవారు కూడా తమ సహచరులను కలిసే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని సింగపూర్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు.