కిక్కిరిసిన యాదగిరిగుట్ట..స్పెషల్ దర్శనానికి గంటన్నర టైం

కిక్కిరిసిన యాదగిరిగుట్ట..స్పెషల్ దర్శనానికి గంటన్నర  టైం
  •  ధర్మదర్శనానికి నాలుగు, స్పెషల్ దర్శనానికి గంటన్నర  టైం 
  •  పిల్లలకు సెలవులు ముగుస్తున్నందున గుట్టకు క్యూ కట్టిన భక్తులు 

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. వేసవి సెలవులు ముగిసి సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభమవుతుండడంతో..హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు గుట్టకు తరలివచ్చారు. రద్దీ కారణంగా నారసింహుడి ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర పట్టింది. భక్తులు ఎక్కువగా సొంత వాహనాల్లో రావడంతో.. కొండపైన, కింద వాహనాల పార్కింగ్ ఏరియా పూర్తిగా నిండిపోయింది.  

ఆదాయం రూ.57.94 లక్షలు

భక్తులు నిర్వహించిన రకరకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఒక్కరోజే స్వామివారి ఖజానాకు రూ.57,94,991 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.21,67,800, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.8.48 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.5,29,800, వీఐపీ దర్శనాల ద్వారా రూ.5.25 లక్షలు, యాదరుషి నిలయం ద్వారా రూ.2,52,312, సత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2,24,800, సువర్ణపుష్పార్చన ద్వారా రూ.1,92,664 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.