చిక్కుల్లోపడ్డ బయ్యారం ఎంపీపీ మౌనిక

చిక్కుల్లోపడ్డ బయ్యారం ఎంపీపీ మౌనిక
  • ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు

మహబూబాబాద్ జిల్లా: బయ్యారం ఎంపీపీ చేపూరి మౌనిక చిక్కుల్లో పడ్డారు. ఎంపీపీగా ఆమె ఎన్నిక చెల్లదని మహబూబాబాద్ ఆర్డీవో కోర్టు తీర్పు వెలువరించింది. తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి గెలిచారని ప్రత్యర్ధులు, ఎస్టీ (గిరిజన) కుల సంఘాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా కొనసాగిన విచారణ ఇటీవలే ట్రైబల్ వెల్ఫెర్ కోర్టులో మౌనిక కుల ధ్రువీకరణ పత్రాలు రద్దుచేస్తూ తీర్పు వెలువడింది.

ఈ తీర్పును ఆధారంగా చేసుకుని ఎంపీపీగా మౌనిక ఎన్నిక చెల్లదని మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కొమురయ్య ప్రకటించారు. అయితే ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తానని ఎంపీపీ మౌనిక ప్రకటించారు. తనను కొందరు ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీపీ మౌనిక ఆరోపించారు.