హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతుంది. సిటీ మొత్తం ఇదే విధంగా ఉంది. 2024, మే 16వ తేదీన సాయంత్రం నుంచి క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో.. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే భారీ వర్షం పడుతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు పడుతుంది వాన. సిటీ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సికింద్రాబాద్ ఏరియాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది.
మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటికి రాకపోవడమే బెటర్ అని సూచించారు. లోతట్ట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
జగద్గిగిరిగుట్ట, బాలానగర్, మేడ్చల్, కీసర ఏరియాల్లోనూ భారీ వర్షం పడుతుంది. కొన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. కుత్బుల్లార్, మల్కాజిగిరి, ఆల్వాల్ ఏరియాల్లోనూ భారీ వర్షం పడుతుంది.
హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే కుండపోతగా పడుతున్న వర్షంతో ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది జీహెచ్ఎంసీ. సాయంత్రం ఆరు, ఏడు గంటల వరకు వర్షం పడే సూచనలు ఉన్నాయని.. అప్పటి వరకు అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది జీహెచ్ఎంసీ. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో కావటం.. ఫుల్ వీక్ డేస్ కావటంతో ట్రాఫిక్ జాంలు ఉంటాయని.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది జీహెచ్ఎంసీ. వాటర్ లాగిన్ ఏరియాల్లో వాహనాలు నిదానంగా సాగుతున్నాయని.. ట్రాఫిక్ జాం ఉంటుందని సూచించింది.
మరోవైపు రాష్ట్రంలో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారం భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. దాదాపు అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆ తర్వాత రెండు రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.