ఇరాన్, ఇజ్రాయిల్ దాడుల ఎఫెక్ట్: భారత్‌లో చిక్కుకున్న విదేశీయులకు గుడ్ న్యూస్.. వీసా గడువు పొడిగింపు !

ఇరాన్, ఇజ్రాయిల్ దాడుల ఎఫెక్ట్: భారత్‌లో చిక్కుకున్న విదేశీయులకు గుడ్ న్యూస్.. వీసా గడువు పొడిగింపు !

పశ్చిమా ఆసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో జరుగుతున్న  ఘర్షణల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి మీకు తెలిసిందే. అయితే భారత్‌కు వచ్చి తిరిగి వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయిన విదేశీయుల కోసం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఉండి, వీసా గడువు ముగిసిపోతున్న విదేశీయులకు మరో 30 రోజులు/ ఒక నెల పాటు ఉచితంగా వీసా గడువును పెంచింది.

వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండాల్సి వస్తే సాధారణంగా భారీ జరిమానా విధిస్తారు. కానీ ఫిబ్రవరి 28 తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల వల్ల చిక్కుకుపోయిన వారికి ఈ జరిమానా ఉండదు. విమాన సర్వీసులు మళ్లీ మొదలైయాక.. విదేశీయులు వారి దేశాలకు వెళ్లడానికి అవసరమైన ఎగ్జిట్ పర్మిట్లను కూడా ప్రభుత్వం ఉచితంగా జారీ చేస్తుంది. దింతో విమానాలు దారి మళ్లించడం వల్ల అనుకోకుండా భారత్‌కు రావాల్సి వచ్చిన విదేశీయులకు కూడా తాత్కాలికంగా ఇక్కడ ఉండేందుకు అనుమతి ఉంటుంది.

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో భద్రతా సమస్యలు తలెత్తాయి. దింతో విమాన ప్రయాణాలు దారి మళ్లించడం లేదా రద్దు కావడం జరుగుతున్నాయి. ఖతార్ వంటి దేశాల నుండి సుమారు 500 మంది భారతీయులు ఇప్పటికే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఖతార్ ఎయిర్‌వేస్ ద్వారా కొచ్చి, ముంబై వంటి నగరాలకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు.

ఈ దాడుల వల్ల చమురు సరఫరా చేసే 'హార్ముజ్ జలసంధి' వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం నెలకొంది. ప్రపంచం మొత్తానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ సముద్ర మార్గం నుండే  వెళ్తుంది.