Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

ఈమధ్య సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం అనేది సాధారణమైన విషయంగా మారింది. ఆమధ్య నాగ చైతన్య-సమంత, నిహారిక-చైతన్య, ధనుష్-ఐశ్వర్య.. రెండు రోజుల క్రితం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్-సైంధవి తమ తమ భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. తాజాగా ఈ లిస్టులో ఓ సీరియల్ నటి కూడా చేరారు. ఆమె మరెవరో కాదు శిరీష. మొగలిరేకులు సీరియల్ తో పాపులర్ అయినా ఈ నటి తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ తో పంచుకున్నారు. తన భర్త నవీన్ తో విడిపిస్తిన్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను, నవీన్‌ భార్యాభర్తలుగా విడిపోయాం. మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల కారణంగా ఇద్దరం విడాకులు తీసుకున్నాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని, మాకు సపోర్ట్ గా నిలిచి, మా నిర్ణయాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నాం. అర్థంచేసుకుంటే సపోర్ట్‌ చేయండి కానీ, విమర్శలు చేయకండి. ఇప్పటికీ నవీన్‌పై నాకు గౌరవం ఉంది. అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు.. అంటూ రాసుకొచ్చారు శిరీష్. ప్రస్తుతం శిరీష చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.