కొవిడ్​ పేషెంట్​కు 108లో డెలివరీ

కొవిడ్​ పేషెంట్​కు 108లో డెలివరీ

అచ్చంపేట, వెలుగు: కరోనా బారిన పడిన నిండు గర్భిణిని 108లో హాస్పిటల్​కు తరలిస్తుండగా దారిలోనే ప్రసవించింది. అంబులెన్స్​సిబ్బంది రిస్క్​తీసుకుని డెలివరీ చేశారు. ఈ సంఘటన నాగర్​కర్నూల్ ​జిల్లా బల్మూర్​ మండలంలో జరిగింది. గట్టు తుమ్మెన్​గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి నిండు గర్భిణి. గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అచ్చంపేట సివిల్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. కరోనా టెస్టు చేయగా పాజిటివ్​అని తేలింది. దీంతో అక్కడి డాక్టర్లు హైదరాబాద్​తీసుకెళ్లండని చెప్పారు. 108లో తరలిస్తుండగా కల్వకుర్తి సమీపంలోకి రాగానే నొప్పులు ఎక్కువయ్యాయి.దాంతో వెహికల్​ను పక్కకి ఆపి ఈఎంటీ బాలస్వామి, పైలట్ నవీన్ రిస్క్ తీసుకుని డెలివరీ చేశారు. భాగ్యలక్ష్మి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు బాలస్వామి తెలిపారు. ఈ సందర్భంగా పేషెంట్ కుటుంబ సభ్యులు అంబులెన్స్​సిబ్బందికి థ్యాంక్స్​చెప్పారు.