నువ్వా.. నేనా!: మెదక్ టీఆర్ఎస్‌‌‌‌లో ఆధిపత్య పోరు

నువ్వా.. నేనా!: మెదక్ టీఆర్ఎస్‌‌‌‌లో ఆధిపత్య పోరు
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోటాపోటీ
  • వేడెక్కుతున్న లోకల్‌‌‌‌ రాజకీయం
  • అయోమయంలో పార్టీ క్యాడర్‌‌‌‌‌‌‌‌


లోకల్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్‌‌‌‌రెడ్డి ఇద్దరూ వివిధ అంశాల్లో నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తుండడం పార్టీ వర్గాలు, ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. వీరి తీరు వల్ల టీఆర్ఎస్​ లీడర్లు, క్యాడర్  అయోమయానికి గురవుతుండడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఆఫీసర్లు ఇబ్బందులు పడుతున్నారు. 

మెదక్, వెలుగు: మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్‌‌‌‌లో మళ్లీ ఆధిపత్య పోరు మొదలైందా? అంటే.. అవుననే అనిపిస్తోంది. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు, ప్రధాన లీడర్ల వ్యవహారశైలి దీనికి మరింత బలం చేకూర్చుతోంది. లోకల్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీఎం కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌‌‌‌రెడ్డి వివిధ అంశాల్లో నువ్వా నేనా? అన్నట్టు వ్యవహరిస్తున్నారు. డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ కోసం ఫండ్స్ సాంక్షన్, పంటల సాగు కోసం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి జీవోల జారీ కావడం.. వంటివి తమ కృషి వల్లే అంటే.. తమ కృషి వల్లే అని ఈ ఇద్దరు లీడర్లు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వారిద్దరి పీఏలు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అనుచరులు వాట్సప్‌‌‌‌ గ్రూపుల్లో పోటాపోటీగా పోస్టులు పెడుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అంటీముట్టనట్టుగానే..
ఇంతకుముందు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మంజూరు, అవసరమైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేయడం, రైతు సమస్యల పరిష్కారం, టీఆర్ఎస్‌‌‌‌కు చెందిన లోకల్‌‌‌‌ బాడీ లీడర్లు, పార్టీ కార్యకర్తలకు సహాయ, సహకారాలు అందించడంలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఒక్కరే చూసుకునేవారు. అయితే మెదక్ నియోజకవర్గానికే చెందిన శేరి సుభాష్​రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక పరిస్థితి మారింది. గతంలో హైదరాబాద్‌‌‌‌లోనే నివాసం ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే మెదక్ వచ్చిపోయే ఆయన తన స్వగ్రామమైన హవేలిఘనపూర్ మండలం కూచన్‌‌‌‌పల్లిలో ఫాంహౌస్ ఏర్పాటు చేసుకుని, వీలైనంత వరకు అక్కడే ఉండే ప్రయత్నం చేస్తున్నారు.  పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వివిధ అభివృద్ధి పనుల మంజూరుకు చొరవ తీసుకోవడం, సీఎంఆర్ఎఫ్ ఫైల్స్ ప్రభుత్వానికి పంపి ఆర్థిక సాయం మంజూరు చేయించడం, రైతుల సమస్యలపై స్పందిస్తూ క్రమంగా నియోజకవర్గంపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇంటర్నల్‌‌‌‌గా ఒకరంటే ఒకరికి పడదు. కానీ ఇంతవరకు బహిరంగంగా ఎక్కడా వారి మధ్య విభేదాలు బయటపడలేదు. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరూ పాల్గొంటున్నప్పటికీ అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. 
మచ్చుకు కొన్ని ఘటనలు..
హవేలిఘనపూర్ మండలం కూచన్‌‌‌‌పల్లి సమీపంలో మంజీరా నదిపై 2019లో కొత్తగా నిర్మించిన చెక్​డ్యాం వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి వేర్వేరుగా పూజలు నిర్వహించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. బాలానగర్ - మెదక్​ నేషనల్ హైవే నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు సీసీరోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం జనవరిలో రూ.12.31 కోట్లు సాంక్షన్ చేసింది. మట్టి రోడ్డుతో భక్తులు, టూరిస్టులు పడుతున్న ఇబ్బందులను తాను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సానుకూ లంగా స్పందించి ఫండ్స్ ఇచ్చారని ఎమ్మెల్సీ సుభాష్‌‌‌‌రెడ్డి జీవో కాపీతో సహా ప్రెస్‌‌‌‌నోట్ రిలీజ్​ చేశారు.  అదే రోజు తన కృషి వల్లే ఏడుపాయల రోడ్డు సాంక్షన్ అయ్యిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి ప్రకటన విడుదల చేశారు.  తాజాగా మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ ఆయకట్టు పంటల పరిరక్షణ కోసం సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి తడులు అందక ఆయకట్టులో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో తాను ఇరిగేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఈఎన్‌‌‌‌సీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని, ఈ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి సింగూర్ నుంచి నీటి విడుదలకు ఉత్తర్వులు ఇచ్చిందని ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రెస్‌‌‌‌నోట్, జీవో కాపీని ఆయన పీఏ మీడియాకు పంపడంతో పాటు వివిధ వాట్సప్​ గ్రూపుల్లో పోస్ట్​ చేశారు. కాగా కొద్ది సేపటి తర్వాత తాను వనదుర్గా ప్రాజెక్ట్​ ఆయకట్టు రైతులకు సాగునీటి కొరత నెలకొన్న విషయాన్ని మంత్రి హరీశ్‌‌‌‌రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం వల్లే సింగూర్ ​నుంచి నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పేరుతో ఆమె పీఏ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ప్రెస్‌‌‌‌నోట్‌‌‌‌ను వాట్సప్​ గ్రూపుల్లో పోస్ట్​ చేశారు. అంతేగాక ఆయకట్టు పరిధిలోని పలువురు రైతులు సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినట్టు ఆడియో క్లిప్పింగ్‌‌‌‌లను మీడియాకు పంపడంతో పాటు వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడం గమనార్హం. అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం సాంక్షన్​ చేయించే విషయంలో, సంబంధిత చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసే విషయంలోనూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు.